ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, మరోవైపు ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి. ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో.. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పుల కారణంగా నేడు, రేపు తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వడగండ్ల వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారానికి సంబంధించిన వాతవరణ రిపోర్టును వెల్లడించింది. రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement