మేకిన్ ఇండియాకి సపోర్ట్‌గా నిలవాలని ఇండియన్ డిఫెన్స్ భావిస్తోంది. అందులో భాగంగా ఇవ్వాల దీనికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేయాల్సిన 48 Mi-17 V5 హెలికాప్టర్లను రద్దు చేసుకోవాలని భారత వైమానిక దళం నిర్ణయం తీసుకుంది. కాగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ చెలరేగడానికి చాలా కాలం క్రితమే 48 హెలికాప్టర్ల కోసం టెండర్‌ను ఉపసంహరించుకోవాలని భారత్ భావించింది. స్వదేశీకరణను దృష్టిలో ఉంచుకుని 48 Mi-17V5 హెలికాప్టర్ల కోసం టెండర్ ఉపసంహరించుకున్నాం. IAF ఇప్పుడు హెలికాప్టర్ల కోసం మేకిన్ ఇండియా కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది”అని అధికార వర్గాలు తెలిపాయి.
భారతదేశం రక్షణ రంగంలో స్వదేశీకరణ దిశగా పటిష్టంగా పనిచేస్తోందని, ఇటీవలి కాలంలో దిగుమతుల కోసం పెద్ద సంఖ్యలో ఒప్పందాలను నిలిపివేయడం, రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటోందని అధికార వర్గాలు తెలిపాయి. నైరుతి రష్యాలోని కజాన్‌లో Mi-17V5 ఉత్పత్తి జరుగుతోంది. ఇది భారత వైమానిక దళం ఉపయోగించే ఆధునిక సైనిక రవాణా హెలికాప్టర్. ఈ హెలికాప్టర్లు అధిక-పనితీరు, బహుళార్ధసాధక కలిగి ఉంటాయి. ఇవి ఉష్ణమండల, సముద్ర వాతావరణాలలో.. ఎడారి పరిస్థితులలో.. ఎలాంటి సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో అయినా అధిక ఎత్తులో ప్రయాణించగలవు.