కోవిడ్ కారణంగా ప్రజల్లో భయం, అందోళనలు మానవత్వాన్ని దూరం చేసింది. రుయాలో చనిపోయిన వారి పార్థివ దేహాలు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ 21 మృతదేహాలను తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అంతా తానై అంతిమ సంస్కారాలు జరిపారు. బుధవారం ఉదయం రుయా మార్చురీలో కోవిడ్ మరణాల వల్ల చనిపోయిన 21 మందికి సాంప్రదాయ రీతిలో పూలమాలలు వేసి స్వయంగా మహా ప్రస్థానం, ముస్లిమ్ జేఎసి వాహనాల్లో పార్థివ దేహాలు వుంచి ఖననం కోసం తరలించారు.
ఈ సందర్భంగా తిరుపతి శాసన సభ్యులు భూమన మాట్లాడుతూ నిన్నటి వరకు అత్యంత ఆత్మీయులుగా మనతో , మన మధ్య తిరిగి వారు కరోనా కారణంగా చనిపోయిన వారిని మానవత్వం లేకుండా వదలి వెళ్లి వెళ్ళేవారు, మరి కొంతమంది కుటుంబం అంతా కరోనా భారిన పడి అంతిమ సంస్కారాలు నోచుకోలేకపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆర్ధిక సమస్య ఏమాత్రం కాదన్నారు. గత సంవత్సరం నాతోటి మిత్రులు, సహచరులు ముస్లిమ్ జేఎసిగా ఏర్పడి అన్నీతామై నేటి వరకు 501 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారని వెల్లడించారు. కోవిడ్ తో చనిపోయిన వారిని ఖననం చేయడం వారి బంధువులకు ఇష్టపడటం లేదన్నారు. తనకు 60 సంవత్సరాల దాటినా, రెండు సార్లు కోవిడ్ సోకినా బయపడలేదన్నారు. ప్రజలు కోవిడ్ భారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.