తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ-జనసేన మేనిఫెస్టో విడుదల చేశాయి. ఈ మేరకు తిరుపతిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ అభ్యర్థి రత్నప్రభతో పాటు పలువులు ముఖ్యనేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.
బీజేపీ-జనసేన మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
✪ తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ
✪ ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి టీటీడీ
✪ ఆలయాలను ప్రభుత్వ అధీనం నుంచి తొలగించేలా చర్యలు
✪ ప్రతి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు… రూ.2 లక్షల వరకు రుణ సౌకర్యం
✪ పాడి, గొర్రెల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు
✪ ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కోసం జలమే జీవనం పథకం
✪ తిరుపతిలో యాదవ కులానికి చెందిన శరభయ్య విగ్రహం ఏర్పాటు
✪ తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో కొత్త బోధనాసుపత్రి స్థాపన
✪ తిరుపతిలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు
✪ రూ.48 కోట్లతో భక్త కన్నప్ప పేరిట ప్రత్యేక పాఠశాలలు
✪ పులికాట్ సరస్సులో పూడికతీత పనులు
✪ పదో తరగతి చదివే దళిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ ఇస్తామని హామీ