తిరుమల, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుమల క్షేత్ర చరిత్రలో తొలిసారిగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన రికార్డు స్థాయిలో హుండీ ద్వారా రూ 7.68 కోట్ల ఆదాయం లభించింది. కరోనా సమస్య ప్రారంభం కావడానికి ముందు సగటున ప్రతిరోజు రూ.2 కోట్ల ఆదాయం లభించేది. కరోనా తరువాత కాలంలో శ్రీవారి ఆలయంలో భక్తుల సందడి మొదలయ్యాక ప్రతి రోజూ హుండీ ద్వారా లభించే సగటు ఆదాయం రూ.3 కోట్లకు పెరిగింది. ఆ మధ్యకాలంలో ఓ పదిసార్లు రూ.4 కోట్ల ఆదాయం లభించిగా.. ఓ నాలుగైదు సార్లు రూ.5 కోట్లను మించిన ఆదాయం లభించింది. గత ఏడాది అక్టోబర్ 25వ తేదీ దీపావళి పర్వదినాన అత్యధికంగా రూ 6.31 కోట్లు హుండీ ద్వారా ఆదాయం లభించింది. కాగా ఈ నెల 2వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున రూ.7.68 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement