తాడ్వాయి, ప్రభ న్యూస్: ఇవ్వాల మేడారంలో తిరుగువారం పండుగను పూజారులు ఘనంగా నిర్వహించనున్నారు. మేడారం మహా జాతర ముగిసిన అనంతరం బుధవారం తిరుగువారం పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పూజారులు తెల్లవారుజామున లేచి తలంటు- స్నానాలు ఆచరించి మేడారంలోని సమ్మక్క గుడి కన్నే పళ్లి లోని సారలమ్మ గుడి లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా పూజారులు గుడిని శుభ్రంగా శుద్ధి చేసి రంగు రంగుల ముగ్గులతో అలంకరించి అందంగా ముస్తాబు చేస్తారు. అనంతరం పూజారులు వారి కుటు-ంబ సభ్యులు అందరూ హాజరై తిరిగివారం పండుగను ఘనంగా నిర్వహించి దీంతో మహా జాతర ముగిసిపోతుంది. అనంతరం వచ్చే ఆదివారం పూజారులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఊరి బయటకు వనభోజనాలకు వెళ్లి దేవతలకు తల్లులకు మేకలను కోళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.