Wednesday, November 20, 2024

టైమ్స్ నౌ-పోల్‌స్ట్రాట్ ఒపీనియన్ పోల్స్ ఫ‌లితాలు..ఏం తేల్చాయి..

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ సీఎం అభ్య‌ర్థి యోగి ఆదిత్యానాథ్ అని ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. దాంతో వ‌చ్చే అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్ ని దృష్టిలో పెట్టుకుని బిజెపి నేత‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో తెగ ప‌ర్య‌టిస్తున్నారు. ఎందుకంటే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ని బిజెపి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దాంతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభాలు, హామీలు మొద‌ల‌య్యాయి. ఇప్పటికే ప్రజల మనసును చూరగొనే పనిలో బీజేపీ పడగా.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలూ బలంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ హడావిడిలోనే వచ్చే ఎన్నికలపై మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. టైమ్స్ నౌ-పోల్‌స్ట్రాట్ ఒపీనియన్ పోల్స్ ఫలితాలు బీజేపీకి పెద్ద ఊరట ఇచ్చాయి. ఈ ఒపీనియన్ పోల్స్‌ను నవంబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ మధ్య నిర్వహించారు. సుమారు 9000 మంది అభిప్రాయాలు సేకరించి రూపొందించారు.

ఈ పోల్ లో బీజేపీనే ఉత్తరప్రదేశ్‌ను హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. యూపీ అసెంబ్లీలో 403 సీట్లున్నాయి. ఇందులో మెజార్టీ మార్క్‌కు మించి 239 నుంచి 245 సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశముందని తెలిపాయి. అయితే రాష్ట్రంలో రెండో అతిపెద్దగా పార్టీ సమాజ్‌వాదీ పార్టీ నిలిచే అవకాశముందని వివరించాయి. ఇది కూడా బీజేపీకి చాలా దూరంలో నిలవనుంది. బీజేపీ దాదాపు 250 సీట్లను రాబట్టే అవకాశముందని పోల్స్ తెలుపగా సమాజ్‌వాదీ పార్టీ మాత్రం 119 నుంచి 125 స్థానాల దగ్గరే ఆగిపోయే ఛాన్స్ ఉన్నదని వెల్ల‌డించింది. కాగా, బీఎస్‌పీ మాత్రం అటు బీజేపీకి, ఇటు సమాజ్‌వాదీ పార్టీ పెద్దమొత్తంలో ఓటు షేర్‌ను కోల్పోతుందని అంచనా వేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement