Wednesday, November 20, 2024

గూగుల్ ని వెన‌క్కి నెట్టిన టిక్ టాక్ – 2021లో అత్యంత పాపుల‌ర్ యాప్ ఇదే

టిక్ టాక్ తెలియ‌నివారు ఉండ‌రేమో. అంత‌లా పాపుల‌ర్ అయింది. షార్ట్ వీడియోస్ తీసి ఈ యాప్ లో పోస్ట్ చేసి స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు ప‌లువురు. టిక్ టాక్ ఈ ఏడాది అత్య‌ధికంగా హిట్స్ ను సంపాదించింది. కాగా ఈ యాప్ ను కేంద్ర ప్ర‌భుత్వం 2020లో భ‌ద్ర‌త‌కు ముప్ప‌ని నిషేధించింది. అంత‌కు ముందు వ‌ర‌కు ఇండియాలో ఎక్కువ మంది యూజ‌ర్ల‌తో దూసుకుపోయిందీ యాప్. ర్యాంకుల పరంగా ఫిబ్రవరిలో టిక్ టాక్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. మార్చి, జూన్ లోనూ మొదటి స్థానంలో నిలిచింది. తిరిగి ఆగస్ట్ నుంచి హిట్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటూ వస్తోందిద‌ని క్లౌడ్ ఫ్లేర్ తెలిపింది.

2020లో హిట్స్ పరంగా గూగుల్ మొదటి స్థానంలో ఉండగా, టిక్ టాక్, అమెజాన్, యాపిల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ టాప్ 10వ స్థానంలో నిలిచాయి. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కు చెందినదే టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఈ సంస్థకు ఉన్నారు. అంతేకాదు ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉండ‌టం విశేషం. టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ ను.. పొట్టి వీడియోల (షార్ట్ వీడియోస్) సామాజిక మాధ్యమ యాప్ టిక్ టాక్ వెనక్కి నెట్టేసింది. 2021 సంవత్సరానికి అత్యంత పాప్యులర్ వెబ్ సైట్ (యాప్) గా నిలిచినట్టు ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ ప్రకటించింది. టిక్ టాక్ ఈ ఏడాది అత్యధిక హిట్స్ ను సంపాదించిందని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement