మూడు వ్యవసాయి చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఆ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ స్పందించింది. పార్లమెంట్లో సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర సమస్యలపై రైతులతో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు.
కాగా, గత ఏడాది కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలపై ప్రజలకు నచ్చచెప్పేందుకు ఎంతో ప్రయత్నించామని అన్నారు. ఈ చట్టాలను కొందరు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారని తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిందని… వారి కోరిక మేరకు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..