Monday, November 18, 2024

మ‌ళ్లీ విస్త‌రిస్తోన్న ‘ఎల్ టీటీఈ’ – నిఘా పెట్టిన‌ ఎన్ ఐఏ

1970వ సంవ‌త్స‌రంలో ఏర్ప‌డింది ఎల్ టీటీఈ అంటే .. టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ్ ఈలం. ఈ సంస్థ శ్రీలంక‌కి నిద్ర లేకుండా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ‌లోని వారు శ్రీలంక ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌మ హ‌క్కుల కోసం పోరాటాన్ని కొన‌సాగించారు. 2009వ సంవ‌త్స‌రంలో అక్క‌డి ప్ర‌భుత్వం ఎల్ టీటీఈ ఉద్య‌మ సార‌ధి ప్ర‌భాక‌ర‌ణ్ ని హ‌త‌మార్చింది. అప్ప‌టి నుంచి ఈ సంస్థ కార్య‌క‌లాపాలు క‌నుమ‌రుగైపోయాయి. కాగా మ‌ళ్ళీ ఎల్ టీటీఈ విస్త‌రిస్తున్న జాడ‌లు క‌నిపిస్తున్నాయి. ప‌లువురు ఈ వర్గం విస్తరణకు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతేడాది తమిళనాడులో నివాసం ఉంటున్న లక్ష్మణన్ మేరీ బిరాన్ సింఘే అనే 50 సంవత్సరాల మహిళను అరెస్టు చేశారు. వాస్తవానికి ఈమె శ్రీలంక దేశస్థురాలు. 2019లో శ్రీలంక పాస్ పోర్టు ద్వారా తమిళనాడుకు వచ్చిన ఆమె వీసా గడువు 2020లో ముగిసిపోయింది.

అయినా చెన్నైలోని అన్నానగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. కాగా గ్యాస్ బిల్లు ఆధారంగా ఆమె ఇండియా పాస్ పోర్టు సాధించింది. బెంగుళూరు మీదుగా ముంబయ్ కి ప్రయాణమవుతున్న నేపథ్యంలో ఆమెను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆమెకు సహకరించిన వారిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో లక్షదీవుల సమీపంలో ఎల్ టీటీఈలో అధికారికంగా ఉన్న సద్గుణం అలియాస్ సెబాస్టియన్ ను గతేడాది మార్చిలో అరెస్టు చేశారు. అతడి నుంచి ఏకే 4 తూటాలు 300 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు విచారణ చేయడంతో ఎల్ టీటీఈ పునరుద్ధరణ కోసం మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్ప‌ష్ట‌మ‌యింది. ఇదిలా ఉండగా కెన్నిసన్ పొర్ మాండో భాస్కరన్ జాన్సన్ సామువేల్ సెల్ముదన్ అనే శ్రీలకంకు చెందిన నలుగురు వ్యక్తులు ముంబయ్ హార్బర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసినట్లు తేలింది. చెన్నైలో పట్టుబడిన మహిళతో పాటు ఈ నలుగురు పై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. దీంతో అప్రమత్తమైన ఆ విభాగం అధికారులు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకీ ఎన్ఐఏ అధికారులు మూడు పేజీల నివేదికను కూడా సమర్పించారు. తమిళనాడు ఎల్ టీటీఈ పునరుద్దరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ,అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విచారణ జరిపి 15 రోజుల్లోగా బదులివ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ముగ్గురు రాజకీయ నాయకులపై కూడా నిఘా ఉంచాలని సూచించింది. మ‌ళ్ళీ ఎల్ టీటీఈ ప్ర‌స్తావ‌న తెర‌పైకి రావ‌డంతో క‌ల‌క‌లం రేగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement