మనుషుల రక్తం రుచి మరిగిన పులి పని ఖతం అయ్యింది. బిహార్‌లో మ్యాన్ ఈటర్‌గా మారిన పెద్దపులి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు బలిగొంది. దీంతో అక్కడి అటవీశాఖ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు ఆ పులిని చంపేయాలని నిర్జ్ఞించి స్పెషల్ యాక్షన్ చేపట్టారు. శనివారం కూడా ఆ మ్యాన్ ఈటర్ దాడిలో ఓ తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మరణించారు. తల్లీ కొడుకుల మృతితో కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులపై దాడి చేశారు. వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు.
ఇక.. బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహాలో తొమ్మిది మందిని చంపిన ఈ మ్యాన్ ఈటర్‌ని చంపేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ) అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా పులి మట్టుబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దాన్ని ఎట్టకేలకు చంపేసినట్టు అధికారులు ప్రటకించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన పెద్దపులి మృతదేహాన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున జనాలు ఎగబడ్డారు.