Friday, November 22, 2024

పెద్దపులుల మరణాలు పెరిగినయ్​.. గతేడాది 127 చనిపోయినట్టు రికార్డులున్నయ్​: కేంద్రం

దేశంలో పెద్దపులల మరణాలు పెరుగుతున్నాయి. వృద్ధాప్యంతోపాటు వివి ధ కారణాలతో అంతకుముందు 106 పులులు చనిపోతే.. ఒక్క 2021లో 127 టైగర్స్​ మృతిచెందినట్టు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల తెలిపింది. రాజ్యసభలో అనుబంధ ప్రశ్రలకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్​ యాదవ్ సమాధానాలిచ్చారు. పులి జాతి మరణానికి వృద్ధాప్యం, పులుల మధ్య గొడవలు, విద్యుదాఘాతం, వేట వంటి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. పలు రాష్ట్రాలు నివేదించిన వివరాల ప్రకారం.. 2021లో పులుల మరణాల సంఖ్య 127గా ఉంది. గత సంవత్సరం మధ్యప్రదేశ్‌లో గరిష్టంగా 42 పులులు చనిపోయాయి.  ఆ తర్వాత మహారాష్ట్రలో 27, కర్నాటకలో 15,  ఉత్తరప్రదేశ్‌లో 9 పులులు చనిపోయినట్టు రికార్డులున్నాయన్నారు.

అడవిలో పులుల సగటు ఆయుర్దాయం సాధారణంగా 10-12 సంవత్సరాలు ఉంటుందని, అయితే సహజ పర్యావరణ వ్యవస్థలో వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, వలలు, నీళ్లలో మునిగిపోవడం, రోడ్డు, రైలు ప్రమాదాల వంటి కారణాలతో చాలామట్టుకు పులులు చనిపోతున్నాయని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్​ చెప్పారు. అయితే ..పులులతో సహా వాటి పిల్లలు కూడా ఎక్కువగా చనిపోతున్నట్టు తెలిసిందన్నారు. ఈ క్రమంలో వేటగాళ్ల బారిన పడకుండా పలు రక్షణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement