పెద్దపులులు జనసంచార ప్రదేశాల్లోకి వస్తున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్దపులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురిపై పులి దాడికి పాల్పడింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులుల సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తడోబా పులి సంరక్షణ కేంద్రంలో పర్యాటకులకు అనుమతిని నిరాకరిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం చంద్రాపూర్ అటవీ ప్రాంతంలోనే 50మంది మృతిచెందారు. పులుల వరుస దాడులతో అటవీ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement