ఇప్పుడంతా వెబ్‌సిరీస్‌ల కాలం నడుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి తీస్తూ.. ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ టాలెంట్‌ని చూపించుకునేందుకు ఓటీటీలు మంచి వేదికగా మారాయి. అయితే.. హిందీలో వచ్చిన కోడ్ ఎం (code m) వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ బాగుంది. ఈ క్రమంలో దానికి రెండో పార్ట్‌గా సీజన్ 2ని ఈ మధ్యనే రిలీజ్ చేశారు. CODE M SEASON2లో ఓ ఆర్మీ మేజర్‌గా మహిళ ఎట్లాంటి రోల్‌ని పోషించింది. ఆమెకు పై ఆఫీసర్ల నుంచి ఎదురయ్యే సమస్యలు, ఆర్మీ ఇంటెలిజెన్స్‌లో ఉన్న తను ఒక మర్డర్ అటెంప్ట్ కేసును ఛేదిస్తుండగా తలెత్తిన సమస్యలపై ఈ సిరీస్ సాగుతుంది.
అయితే.. తాను చిన్నదానిగా ఉన్నప్పుడే ఆర్మీ ఆఫీసర్ అయిన తన తండ్రి ఇంట్లో జరిగిన బ్లాస్ట్ వల్ల చనిపోతాడు. ఆ తర్వాత తనూ పెద్దదై.. ఆర్మీ ఆఫీసర్ గా మారుతుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాల్లో తన తండ్రి బతికే ఉన్నాడని, ఆర్మీలో జరిగే కొంతమంది కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలను హతమార్చేందుకు తన తండ్రి చనిపోయినట్టు కలరింగ్ ఇచ్చాడని తెలుసుకుంటుంది. చివరికి ఆర్మీ మేజర్‌గా తన తండ్రిని పట్టుకునే క్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలను తెలుసుకుంటుంది ఆర్మీ మేజర్ మోనికా.
మేజర్ మోనికా మెహ్రా (జెనిఫర్ వింగెట్), ఆర్మీ కార్గిల్ దివాస్ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపడానికి చేసిన కుట్రను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో ఆ హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకునే క్రమంలో చేజ్ చేస్తుండగా ఒక రకమైన కెమికల్ తాగి క్షణాల్లో అతను చనిపోతాడు. అయితే.. ఈ దాడి వెనుక ఎవరున్నారు? వారికి ఏం కావాలి? మోనికా మెహ్రా సైన్యానికి సంబంధించిన చీకటి సత్యాన్ని ఎలా వెలికితీస్తుంది.. అనేది కోడ్ M సీజన్ 2లో చూపించారు.
మొదటి సీజన్ వలె కాకుండా జెనిఫర్ ఈ పాత్రని సునాయసంగా చేయడానికి కాస్త టైమ్ తీసుకుందనే చెప్పవచ్చు. ఆమె ఇంతకు ముందు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒక భావన వచ్చింది. ఈ సిరీస్ లో జెనిఫర్ వింగెట్ కూడా తక్కువ డ్రామా, ఎమోషనల్ మూమెంట్‌లను ఈజీగా కన్వే అయ్యేలా చేశారు. ఆమె ఎక్కువ సమయం ఈ సిరిస్ మొత్తంలో యాక్షన్ మోడ్‌లోనే ఉంటుంది. అయితే.. వెబ్ సిరీస్ అనగానే బోల్డ్ సీన్స్, సెక్చువల్ కంటెంట్, వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది అని భయపడే వారికి ఆ భయాలేవీ అవసరం లేదు. ఈ సిరీస్‌ని ఇంటిల్లిపాది మొత్తం కూర్చొని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
కోడ్ M సీజన్ టూకి అక్షయ్ చౌబే దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ వలె కాకుండా ఇది డ్రామా, థ్రిల్లర్ అంశాల మిశ్రమంగా ఉంది. ఇక్కడ స్ట్రెయిట్-అప్ యాక్షన్-థ్రిల్లర్ కథనాన్ని చూడొచ్చు. ప్రారంభంలోనే హత్య నుంచి కాపాడే ఒక ఆఫీసర్‌గా మేజర్ మోనికా ఎట్లా వ్యవహరిస్తుంది అనేది చాలా బాగా ఎలివేట్ చేశారు. కోడ్ M కిల్లర్‌ని కనుగొనడం. తన యాక్షన్‌ని వేగవంతం చేయడం, ఒక చిన్న మలుపు నుండి మరొకదానికి ఇట్లా మారుతుంటాయి. ఈ టేకింగ్ చాలా బాగున్నా.. ఓటీటీలో అట్లాంటి కంటెంట్ కోరుకునే వారికి కాస్త అసంతృప్తి ఉంటుందనే చెప్పవచ్చు. కథలో ట్విస్ట్ లు చాలా ఉన్నాయి.
ఇటీవల వచ్చిన చాలా వెబ్ సిరీస్‌ల మాదిరిగానే కోడ్ M సీజన్ 2 ముగింపు కూడా మరో సీజన్‌కు స్కోప్‌ను వదిలివేస్తుంది. కథ చివర్లో ట్విస్ట్ ఇస్తారు. మొత్తంమీద కోడ్ M సీజన్ 2 మంచి యాక్షన్ థ్రిల్లర్ అనడంలో సందేహమేమీ లేదు.
కోడ్ M సీజన్ 2లో ప్రధాన సమస్యగా శక్తివంతమైన సహాయనటులు లేకపోవడమే అని చెప్పుకోవచ్చు. మొదటి భాగం అట్లానే ఉంది. తనూజ్ విర్వానీ వివిధ సిరీస్‌లలో కనిపించే తన విలక్షణమైన సహాయక చర్యను కొనసాగిస్తున్నాడు. రెండవ సీజన్‌లో స్వానంద్ కిర్కిరే, అతుల్ కుమార్ కొత్త గా చేరారు. తమ పాత్రల్లో ఇద్దరూ బాగా నటించారు. దీనికి నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. కథనానికి తగ్గట్టు బీజీఎం అదిరిపోయింది. జై బన్సాలీ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిఖిల్ సేన్ ఎడిటింగ్ చాలా బాగుంది.
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ డిజిటల్ మీడియా