ఓ వ్యక్తి బోట్ లో సముద్రంలోకి వెళ్లాడు. బోట్ లోనుండే ఓ చేపని పట్టుకున్నాడు. దాంతో ఆయన తన ఎడమ చేతిలో చేపను, కుడి చేతితో ఫోన్ ను పట్టుకుని సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీలు దిగాక చేపను తిరిగి సముద్రంలోకి విసిరేద్దామనుకున్నాడు. అయితే, ఎడమ చేతిలోని చేపకు బదులు.. కుడి చేతిలోని ఫోన్ ను సముద్రంలోకి విసిరేశాడు. తానేం చేశాడన్నది గమనించేలోపే ఫోన్ సముద్రం పాలైంది. అది చూసి అవాక్కయిపోయాడు. ఏం చేస్తాడు. మొహం అదోలా పెట్టాడు. ఇదంతా పక్కనే మరో బోట్ లో వెళుతున్న వ్యక్తి వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టగా విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిలో పడిపోయాడంటూ ఆ వ్యక్తిపై సెటైర్లు పడుతున్నాయి. ట్విట్టర్ లో ఈ వీడియోను ఏకంగా కోటీ 28 లక్షల మంది వీక్షించడం గమనార్హం. లక్షన్నర లైకులు, 30 వేల దాకా రీట్వీట్లు కూడా వచ్చాయి.
చేపను విసరబోయి ఫోన్ ని సముద్రంలోకి విసిరాడు-ఈ వీడియోని కోటీ 28లక్షల మంది చూశారు
Advertisement
తాజా వార్తలు
Advertisement