Tuesday, November 26, 2024

Breaking: ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్

ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్ అయిన ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. పుట్టినరోజు వేడుకలకు అని చెప్పి బయటకు వెళ్లిన ఇద్దరు యువతులు, ఓ బాలిక అదృశ్యమయ్యారు. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులైన హసీనా, సకీనా అనే ఇద్దరు యువతులతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబసభ్యులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement