Sunday, November 24, 2024

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని.. మూడేళ్ల బాలిక మృతి

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని మూడేళ్ల బాలిక మృతి చెందింది. పంజాబ్‌లోని రోపార్ జిల్లాలోని కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో చోటు చేసుకుంది.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీఆర్ పి అధికారులు మరణించిన బాలిక ఖుషి(3) అని గుర్తించారు. ఆమె తండ్రి వికాస్, వీధి వ్యాపారి. రోజూలాగే అతను రైలు పట్టాలు దాటి వెడుతున్నాడు. అయితే అతని మూడేళ్ల కూతురు అతడిని అనుసరించడం గుర్తించలేదు.

దీంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే దూరం నుంచి వీరిని గమనించిన రైలు డ్రైవర్‌ మూడుసార్లు హారన్‌ మోగించాడని, అయితే చిన్నారికి రైలు హారన్ విషయం అర్థం కాలేదని తెలుస్తోంది. వేగంగా వస్తున్న రైలు ఒక చివర కొంత భాగం బాలికను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ ఉనా రైల్వే ట్రాక్ వద్ద బాలిక పట్టాలు దాటేందుకు ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాం అని జీఆర్‌పీ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుల్‌దీప్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement