Friday, November 22, 2024

కొత్త దేశం బార్బ‌డోస్‌కు ముగ్గురు మ‌హిళ‌లు!

నాలుగొంద‌ల ఏళ్ల బ్రిటీష్ పాల‌న నుంచి విముక్తి పొందిన బార్బ‌డోస్ మంగ‌ళ‌వారం స్వాతంత్ర్య దినోత్స‌వాలు జ‌రుపుకుంది. బార్బ‌డోస్‌కు కొత్త అధ్య‌క్షురాలిగా సంద్రా మేస‌న్ ఎన్నిక‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రిగా మియా మోట్లీ ఉన్నారు. వీరిద్ద‌రూ మ‌హిళా నేత‌లే. బార్బ‌డోస్ నేష‌న‌ల్ హీరోగా ప్ర‌ముఖ గాయ‌కురాలు 33 ఏళ్ల రిహ‌న్నాను ప్ర‌ధాన‌మంత్రి జాతీయ హీరోగా ప్ర‌క‌టించారు.

రిహ‌న్నా ఇప్ప‌టికే బార్బ‌డోస్ ప్ర‌ముఖ పౌరురాలిగా బ‌హుముఖ గుర్తింపు పొంది ఉన్నారు. 72 ఏళ్ల సంద్రా మేస‌న్ బార్బ‌డో్స్ కొత్త అధ్య‌క్షురాలిగా మంగ‌ళ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆమె 2018 నుంచి గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ప్ర‌ధాన‌మంత్రిగా మియా అమొర్ మోట్లీ 2018 నుంచి బార్బ‌డోస్ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్నారు. 56 ఏళ్ల మియా మోట్లీ లేబ‌ర్ పార్టీ నాయ‌కురాలు. అత్యంత త‌క్కువ జ‌నాభాతో అతి చిన్న దీవిగా ఉన్న బార్బ‌డోస్ ప్ర‌పంచ ప‌టంలో స‌రికొత్త స‌ర్వ‌స‌త్తాక రిప‌బ్లిక్‌గా అవ‌త‌రించింది. ముగ్గురు మ‌హిళా మ‌ణులు సార‌థ్యం వ‌హించ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement