కరోనా వేరియంట్లతో ఇబ్బందులు తప్పెంట్లు లేదు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందికి కరోనా సోకుతోంది. ముంబైంలోని ఓ యువ డాక్టర్ కి కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు సార్లు వైరస్ బారిన పడింది. ముంబై నగరంలోని ములుండ్ కొవిడ్ సెంటర్లో పని చేసిన వైద్యురాలు శ్రుతి హలారి మొత్తంగా మూడుసార్లు వైరస్ బారినపడగా..వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు సార్లు ఆమెకు కరోనా సోకింది. మొత్తంగా ఈ 26 ఏళ్ల యువ వైద్యురాలు 13 నెలల్లో మూడుసార్లు కరోనా బారినపడ్డారు. తాను వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడ్డట్లు బాధిత వైద్యురాలే తెలిపారు. ముంబైలోని ములుండ్ కొవిడ్ సెంటర్లో పని చేస్తోంది డాక్టర్ శృతి హలారి.
నేను మూడోసారి వైరస్ బారినపడ్డాను. ఈ సారి వైరస్ తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నా సోదరుడికి, తల్లికి మధుమేహం ఉంది. తండ్రికి రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలున్నాయని డాక్టర్ శృతి హలారి తెలిపారు. సోదరుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. రెండు రోజులు అతన్ని ఆక్సిజన్‌పై ఉంచి చికిత్స అందించారు’ అని మీడియాకు తెలిపారు. రక్తంలో కొవిడ్ యాంటీబాడీస్ కోసం చేసిన పరీక్షల్లో సానుకూల ఫలితాలను వచ్చాయని పేర్కొన్నారు.
అయితే, కొవిడ్ టీకా వేయించుకున్నా వైరస్ సోకుతుందని, అయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం మొదటి నుంచి చెబుతున్నారు. టీకా రెండు డోసుల తర్వాత వైరస్ బారినపడినవారున్నారు. అన్ని వయస్సులవారికి బ్రేక్ థ్రో ఇన్ఫెక్షన్ (టీకాలు తీసుకున్న తర్వాత వైరస్ సోకడం) వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ‘టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు సహకరిస్తాయి. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉండదు’ అని వాక్‌హార్డ్ దవాఖానకు చెందిన వైద్యుడు బెహ్రామ్ పార్దివాలా తెలిపారు. ఇటీవల, ఐసీఎంఆర్ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే, వైరస్ వైవిధ్యాలు, తక్కువ రోగ నిరోధకశక్తి రీ ఇన్ఫెక్షన్కు కారణాలై ఉండవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి : వినేష్ ఫోగట్ టోక్యో విమానం మిస్..