రూ.1200కోట్ల విలువైన ట్విన్ టవర్స్ ని కూల్చి వేశారు అధికారులు. నోయిడా లోని ట్విన్ టవర్స్ ను ఆదివారం కూల్చి వేశారు. ట్విన్ టవర్స్ కూల్చివేతకు రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేశారు అధికారులు. ముంబై కి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేసే బాధ్యతలను తీసుకుంది. సినిమాలలో చూపించినట్టుగానే క్షణాల వ్యవధిలో ఈ భారీ భవంతులు నేలమట్టం అయ్యాయి. చివరిసారిగా ఈ భవనాల ముందు సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున స్థానికులు ఇక్కడికి వచ్చారు. ఈ టవర్స్ కూల్చివేత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల నివాసం ఉన్న వారిని ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దేశ రాజధాని ఢిల్లీకి 50 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో సూపర్ టెక్ సంస్థ ఈ ట్విన్ టవర్స్ ను నిర్మించింది. ఈ భవనాల కూల్చివేత కారణంగా ఏర్పడిన వ్యర్ధాల తొలగింపునకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రూ.1200కోట్ల విలువైన ట్విన్ టవర్స్ కూల్చివేత-వ్యర్థాలను తొలగించేందుకు మూడు నెలలు
Advertisement
తాజా వార్తలు
Advertisement