Tuesday, November 26, 2024

Breaking : ఉక్రెయిన్ అధ్య‌క్షుడిపై మూడుసార్లు హ‌త్యాయ‌త్నం

గ‌త కొన్ని రోజులుగా ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. అయితే గత తొమ్మిదిరోజుల్లో మూడు సార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. మూడు సార్లు తాము అధ్యక్షుడిని కాపాడుకున్నట్లు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు తలొగ్గే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. రష్యాకు చెందిన 939 ఆర్మ్ ట్యాంకులను ధ్వంసం చేశామని పేర్కొంది. రష్యాకు చెందిన 251 ట్యాంకులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 9166 మంది రష్యా సైనికులు తమ దాడిలో హతమయ్యారని ఉక్రెయిన్ పేర్కొంది. తమ సైనికులతో పాటు పౌరులు కూడా ప్రాణాలొడ్డి రష్యన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ఉక్రెయిన్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement