Friday, November 22, 2024

ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్ కి బెదిరింపు మెసేజ్ కాల్ – 26/11అటాక్స్ జ‌రుగుతాయ్..

26/11 అటాక్స్ లేదా ఉద‌య్ పూర్ లో టైల‌ర్ హ‌త్య‌..సిద్దూ మూసేవాలా లాంటి దాడులు జ‌రుగుతాయ‌ని ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు వ‌చ్చిన మెసేజ్ కాల్‌ తీవ్ర కలకలం రేపింది. కంట్రోల్ సెల్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఈ మెసేజ్ ని పంపాడు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. ట్రాఫిక్ కంట్రోల్ సెల్ వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన బెదిరింపు సందేశం పాకిస్తాన్ నెంబర్ నుంచి వచ్చినట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాల తెలిపింది. తనని..త‌ను ఉన్న స్థానాన్ని గుర్తించినట్లయితే’ అది బయట ఉన్నట్టుగా తేలుతుందని మెసేజ్ పంపిన వ్యక్తి చెప్పాడు. ముంబైలో దాడి జరుగుతుందని మెసేంజర్ బెదిరించాడు. భారత్‌లోని ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడతార‌న్నాడు..

ఈ బెదిరింపు సందేశంపై భద్రతా బలగాలు విచారణ జరుపుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.మేం దీనిని పరిశీలిస్తున్నాం. రాత్రి నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇతర ఏజెన్సీలకు కూడా సమాచారం అందించబడిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇది ఫ్రాంక్ సందేశమా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెదిరింపు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అన్నారు. ఈ విషయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా స్పందించారు. మొదట రాయగడ తీరంలో బోటు రికవరీ, ఇప్పుడు పోలీసుల బెదిరింపు సందేశం. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది అని ఆమె ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement