ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి పెను ముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ప్రైవేటు కరెన్సీకి తులిప్ పువ్వు విలువ కూడా ఉండదని తెలిపారు. ఆర్బీఐ దైపాక్షిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన క్రిప్టో కరెన్సీల విషయాన్ని ప్రస్తావించారు. ప్రైవేటు క్రిప్టో కరెన్సీని ఏ పేరుతో పిలిచినా అవి స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరతానికి ముప్పును తెస్తాయన్నారు.
ఆర్థిక స్థిరతం కోసం ఆర్బీఐ తీసుకునే చర్యలను అవి బలహీనపరుస్తాయన్నారు. మదుపర్లు పెట్టుబుడులు పెట్టేముందు పరివిధాల ఆలోచించుకోవాలని హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీలు అంతర్లీనంగా ఎలాంటి కలిగి ఉండవు. వాటి విలువ తులిప్ పువుల విలువకూడా ఉండదు. కాగా 17వ శతాబ్దంలో చోటు చేసుకున్న తులిప్ మానియాతో క్రిఎ్టో కరెన్సీని పోలుస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.