Friday, November 22, 2024

చ‌ర్చ‌ల‌కు ర‌ష్యాను న‌మ్మ‌లేం : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ

గ‌త నెల రోజుల‌కు పైగా ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్ మ‌ధ్య యుద్దం కొన‌సాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు ముగించేందుకు రాజీ దిశగా చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు మొగ్గుచూపాయి. అయితే చర్చల ద్వారా పాజిటివ్ సంకేతాలు వస్తున్నా.. రష్యాను పూర్తిగా నమ్మలేమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, చెర్నిహైవ్ సమీపంలో సైనిక కార్యకలాపాలను తగ్గించుకునేందుకు రష్యా చర్చల్లో అంగీకరించింది. అయితే ఇది పూర్తిగా ఉక్రెయిన్ సైనికుల వల్లే సాధ్యపడిందని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ సైనికుల ధైర్యవంతమైన చర్యల వల్లే రష్యా వెనక్కి తగ్గిందన్నారు. రాజీ అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని, పరిస్థితులు ఇంకా పూర్తిగా మెరుగు పడలేదని అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగించే అవకాశాలున్నాయని, ఉక్రెయినియన్లు ప్రతిఘటనను కొనసాగించాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement