భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. థామస్ కప్‌ని భారత షట్లర్లు 3.0తో కైవసం చేసుకున్నారు. ఇండియాకి తొలి స్వర్ణం అందించారు శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రణయ్.. కాగా, ఫైనల్ లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీతో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. 21-15 తేడాతో తొలి గేమ్‌ను శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. జొనాథన్ క్రిస్టీపై కిదాంబి మూడు రౌండ్లలోనే ఆధిక్యం కనబరిచాడు. ఫైనల్ చేరే క్రమంలో మలేషియా, డెన్మార్క్‌పై అద్భుత విజయాలు సొంతం చేసుకుంది భారత బృందం. ముఖ్యంగా సీనియర్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ భారమంతా నెలకొని ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో జట్టుకు అద్భుత విజయాలు అందించడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికి 14 సార్లు గెలిచిన ఇండోనేషియాపై ఇండియా గెలిచి తొలిసారి స్వర్ణం సాధించడంతో ఇండియన్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.
Breaking: థామస్ కప్ భారత్ కైవసం.. తొలిసారి స్వర్ణం సాధించి రికార్డు సృష్టించిన షట్లర్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement