Thursday, November 21, 2024

ఈసారి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు – ఎనిమిది రోజులే

ఈ సారి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఎనిమిది రోజులే కొన‌సాగ‌నున్నాయి. నేటి నుండి ఈ నెల 15వ‌ర‌కు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. సంప్ర‌దాయానికి భిన్నంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే ఈ ద‌ఫా తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌మావేశాలు ప్రారంభం కాగానే.. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెందిన వార్షిక బ‌డ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.మంత్రి హ‌రీశ్ రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న బీఏసీ స‌మావేశం మొద‌లైంది. ఈ స‌మావేశంలో స‌భ‌లో చ‌ర్చించాల్సిన అంశాలు, అందుకు అవ‌స‌రమ‌య్యే స‌మ‌యాన్ని బేరీజు వేసుకున్న ప్రభుత్వం… ఈ నెల 15 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణయించింది. స‌మావేశాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన ఆదివారం మాత్ర‌మే సెల‌వుగా ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement