ఈసారి మార్చి నెల నుండే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్..మే..జూన్ నెలల్లో అధికంగా ఎండలు ఉండనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. అలాగే, ఈ మూడు నెలల కాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారత్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపింది. మరీ ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే ముప్పు ఉన్నదని ఐఎండీ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వేసవి తాపం తట్టుకునేలా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.పనికి వెళ్లేవారు డీహైడ్రేషన్ కి గురి కాకుండా అధికంగా నీటిని తాగాలని..లిక్విడ్స్ రూపంలోమజ్జిగ..కోకోనట్ వాటర్ తాగాలని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement