సంక్రాంతి అనగానే భోగి మంటలు, కొత్త దుస్తులు, కనుమ పండుగ, హరి దాసులు, అత్త గారింటి వచ్చే అల్లుళ్లు ఇవే కదా అందరికీ గుర్తుకు వచ్చేది! ఏడా దిలో మొదటి పండుగ సంక్రాంతిని గ్రాండ్‌గా చేసుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారు. తెలుగు ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు, వైవిధ్య భరిత కార్యక్రమాలను అందిస్తున్న ఛానెల్ ‘జీ తెలుగు’ సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలను దాటి కేరళకు వెళ్లింది. కేరళలో జీ కుటుంబ సభ్యులు చేసుకుంటున్న సంక్రాంతి పండుగ వేడుకలను ప్రేక్షకుల ముందుకు తేనుంది జీ తెలుగు.
ఇందులో డ్యాన్స్‌లు, కామెడీ స్కిట్‌లు, మ్యూజిక్‌తో సహా అన్ని ఈవెంట్లు ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తాయి. ఈ సంక్రాంతికి మీ అభిమాన తారలు చేసిన సందడి చూడడానికి సిద్ధంగా ఉండండి. 13,14వ తేదీల్లో రెండు విభాగాలుగా ఈ వేడుకను ఛానల్ ప్రసారం చేయనుంది. వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సెలబ్రిటీలు, వినోదంతో కూడిన వేడుకలకు మరింత సందడి తీసుకు వచ్చారు.
జనవరి 13న కేరళలో సంక్రాంతి అల్లుళ్ల సందడి ప్రసారమవుతుంది. తెలుగు ఇంటి ఆడపడుచు, కేరళ తనయ సుమ కనకాల ముందుండి నడిపించనున్నారు. జనవరి 14వ తేదీన ప్రసారమయ్యే రెండో భాగం ‘బంగార్రాజుస టీంతో అనగా నాగార్జున, నాగచైతన్య, కృతి శెట్టితో సహా పలువురు నటులు కనిపించనున్నారు. పండుగ సంతోషానికి మరింత వినోదాన్ని అందించే జీ కుటుంబ సభ్యులు, నటుల సంక్రాంతి వేడుకలను చూసేందుకు మీ జీ తెలుగు ఛానెల్‌ను తప్పక వీక్షించండి! అని జీ తెలుగు అంటోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital