Friday, November 22, 2024

Exclusive | ఇదేందీ బేబీ, ఇట్లయ్యింది.. సినిమాలో డ్రగ్స్​ సీన్లపై నోటీసులు ఇస్తామన్న సీవీ ఆనంద్‌!

చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ హిట్‌ అందుకున్న బేబి మూవీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ మూవీపై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ ఇవ్వాల (గురువారం0 ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా సినిమాలో సీన్లు ఉన్నాయని, డ్రగ్స్‌ను ఏ విధంగా ఉపయోగించాలనే సన్నివేశాలను చూపించారన్నారు. మాదాపూర్‌లోని ఫ్రెష్‌లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దాడులు నిర్వహించిన సమయంలోని కొన్ని సన్నివేశాలు ‘బేబి’ సినిమాలో యథాతథంగా పొందుపరిచారని సీపీ తెలిపారు. కాగా, సినిమా బృందానికి ఈ విషయంలో నోటీసులు ఇవ్వనున్నట్లు సీపీ ఆనందన్​ చెప్పారు.. అలాంటి దృశ్యాలను చిత్రీకరించొద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇక.. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని సీపీ హెచ్చరించారు. అయితే, మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారని, ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను కూడా సీజ్‌ చేసినట్లు వివరించారు. సంస్థని ఏర్పాటు చేసుకొని డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని, కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి ఉన్నారని తెలిపారు.

- Advertisement -

సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్నారని, డ్రగ్స్‌కు వినియోగదారుడిగా ఉన్న నవదీప్‌ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. అలాగే ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామన్న ఆయన.. నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో నిర్మాత కూడా పరారీలో ఉన్నట్లు వివరించారు.

హీరో నవదీప్​ వివరణ..
డ్రగ్స్​ కేసులో నవదీప్​ పరారీలో ఉన్నాడనే వార్తలు ప్రచారం కావడంతో.. కొన్ని టీవీ చానళ్లు హీరో నవదీప్​ డ్రగ్స్​ కేసులో ఇరుక్కున్నాడని ప్రచారం చేశాయి. దీంతో హీరో నవదీప్​ మీడియాకు వివరణ ఇచ్చాడు. తాను ఎక్కడికి వెళ్లలేదని, తన ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్​ చేయలేదని తెలిపాడు. నవదీప్​ అంటే తానొక్కడినే కాదని, పోలీసులు హీరో నవదీప్​ అని ఎక్కడా చెప్పలేదని, మీడియా అత్యుత్సాహంతో తనను ఇరికించే ప్రయత్నం చేస్తోందన్నారు. తన పేరును బద్నాం చేయొద్దని నవదీప్​ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement