Tuesday, November 26, 2024

Rahul Gandhi: నేను హిందువుని, హిందువాదిని కాదు!

బీజేపీని టార్గెట్ చేస్తూ హిందుత్వంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జైపూర్‌ లో జరిగిన ‘మెహంగాయ్ హటావో మహా ర్యాలీ’లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ‘హిందూ’, ‘హిందుత్వవాది’ రెండు వేర్వేరు పదాలని, దేశం హిందువులదే తప్ప హిందుత్వవాదులది కాదని వ్యాఖ్యానించారు. తాను హిందువుని, హిందువాదిని కాదన్నారు. మహాత్మా గాంధీ హిందువని.. గాడ్సే హిందుత్వవాది అని చెప్పారు.

హిందుత్వవాదులు తమ జీవితాంతం అధికారం కోసం ప్రయత్నిస్తుంటారని.. వారికి అధికారం తప్ప మరేది అవసరం లేదని రాహుల్ పేర్కొన్నారు. హిందువు సత్యం కోసం శోధిస్తాడని, దానిని సత్యాగ్రహం అంటారు అని తెలిపారు. మనం ఈ హిందుత్వవాదులను అధికారం నుండి తరిమికొట్టాలన్న రాహుల్.. హిందువులను తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement