సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్. దీనిలో దేశంలోని ప్రజలు ఎవరైనా తమ సమస్యలను నివేదించుకోవచ్చు. అయితే ఇట్లా వచ్చిన కంప్లెయింట్స్‌ని పరిష్కరించడానికి, వాటికి సరైన సమాధానం చెప్పడానికి ఓ మానిటరింగ్ విభాగం కూడా ఉంది. అది కూడా కొంత టైమ్‌లైన్ బేస్డ్గా సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ నుంచి ఈ పోర్టల్‌కి అతి తక్కువ ఫిర్యాదులు అందుతున్నట్టు తెలుస్తోంది. ఇక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాటిని పరిష్కరించడంలో కేంద్రం ఎట్లాంటి చొరవ తీసుకోవడం లేదు. ఓ సామాజిక కార్యకర్త అడిగిన సమాచార హక్కు (ఆర్టీఐ) ప్రశ్నకు సంబంధించి డేటా వివరాలు పరిశీలిద్దాం..
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) డేటా ప్రకారం ఆగస్ట్ 7 నాటికి పెండింగ్‌లో ఉన్న యాక్టివ్ ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆగస్టు 1 నుంచి ఇప్పటి దాకా 92 కేసులు మాత్రమే నమోదయ్యాయని, అంతకు ముందు వారంలో 44 కేసులు నమోదయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 105 పరిష్కరించగా 31 పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) ప్రశ్నకు ప్రతిస్పందనగా ఈ డేటా వెల్లడైంది.
ఇక.. రాష్ట్రాల వారీగా యాక్టివ్, డిస్పోజ్ చేయబడిన కేసుల జాబితాలో ఎట్లాంటి పరిష్కారం చూపకుండా ఉన్నవి ఉన్నట్టే పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌గా ఉంది. ఈ రాష్ట్రం నుంచి అతి పెద్ద మొత్తంలో అంటే.. 99,204 కేసులు వచ్చాయి. వీటిలో 99,204 కేసులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇట్లా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందని వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో 34,519 కేసులు నమోదయ్యాయి, వాటిలో 148 గత వారంలో వచ్చాయి. ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో దాఖలైన ఫిర్యాదుల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. “ఇది ఒక వారం డేటా కాబట్టి ఇది పూర్తివివరాలను తెలియజేయడం లేదు. అయితే తెలంగాణలో ఇంత తక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా రిడ్రెసల్ పోర్టల్ గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు ”అని రాబిన్ అన్నారు.
2014 నుండి డేటాలోని నమూనాలను నిశితంగా పరిశీలిస్తే సిస్టమ్ వాస్తవానికి ఎలా పనిచేస్తుందనే దానిపై మరింత వివరణాత్మక పరిశీలన అవసరమని రాబిన్ ఎత్తి చూపారు. ‘‘సంవత్సర కాలంగా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 30 రోజుల్లో పరిసమాప్తం చేయాలనడం కూడా పూర్తిగా కచ్చితమైనది కాదు ” అన్నారాయన.
దేశవ్యాప్తంగా పెండింగ్‌లో కేసులు..
కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పౌరుడి నుండి స్వీకరించిన ఫిర్యాదు దానిపై దాఖలు చేసిన అప్పీల్‌ను పరిష్కరించేదాకా క్లోజ్ కాదని గత నెల 22వ తేదీన చెప్పారు. అన్ని ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించేలా చూసేందుకు గతంలో ఉన్న 45 రోజుల విండో నుండి పరిష్కార సమయాన్ని 30 రోజులకు తగ్గించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. అయితే, అనేక యూనియన్ డిపార్ట్ మెంట్లలో గత నెలల కంటే భారీ సంఖ్యలో కేసులు ముందుకు వచ్చినట్లు డేటా చూపిస్తుంది. ఉదాహరణకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డులో 171 కేసులు, రక్షణ శాఖలో 193 కేసులు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.
‘‘ప్రభుత్వ నియంత్రణకు మించిన పరిస్థితుల’’ కారణంగా 30 రోజులలో కేసు పరిష్కరించకపోతే ఫిర్యాదుదారు మధ్యంతర ప్రతిస్పందనను అందుకుంటారు. ఈ విధంగా పరిష్కరించని కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అయితే వారి పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది అనేది ఎవరి అంచనా. రాష్ట్రాల వారీ డేటాతో పాట గత మూడేళ్లుగా పోర్టల్ ద్వారా దాఖలు చేయబడుతున్న ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సమాధానం కూడా చూపింది. అంతకుముందు సంవత్సరంలో నమోదైన 11,82,844 కేసులతో పోలిస్తే 2021లో పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా 12,34,270 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 1 నుండి జాతీయంగా CPGRAMS రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించింది. ఆ తర్వాత పౌర సౌకర్యాలు, పోలీసు, గృహాలు, భూమికి సంబంధించినవే కాకుండా COVID-19-సంబంధిత సమస్యలు ఉన్నాయి.
CPGRAMS అంటే ఏమిటి?
సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిణలో ఉన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. దేశ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటుంది. పోర్టల్ 2014లో ప్రారంభమైనప్పటి నుండి కొన్ని సంవత్సరాలుగా అప్డేట్ చేస్తున్నారు. CPGRAMS అనేది Google Play స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని ఒక మొబైల్ అప్లికేషన్ కూడా. అంతేకాకుండా UMANGతో లింక్ చేసి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు దీన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.