Tuesday, November 26, 2024

ఇదీ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ అంటే.. టెలికంలో ఎంత మార్పు: ఎయిర్‌ టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌

బకాయిలు చెల్లించిన కొద్ది గంటల్లోనే 5జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని ఎయిర్‌టెల్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ ప్రశంసించారు. శ్రమ లేదు.. ఆఫీసుల చుట్టూ , కారిడార్ల చుట్టూ పరిగెత్తడం లేదు.. పెద్ద వాదనలు లేవు. ఈ విధమైన పనితీరులో వ్యాపారం చేయడం సులభం” అని గురువారం ఓ ఇంటర్వ్యూలో మిట్టల్‌ అన్నారు. ”టెలికాం డిపార్ట్‌మెంట్‌తో నా 30 ఏళ్ల ప్రత్యక్ష అనుభవంలో, ఇది మొదటిది! వ్యాపారం ఇలాగే ఉండాలి.సరైన పనితీరు నాయకత్వంతో టెలికాం అగ్రస్థానంలో ఉంది. ఎంత మార్పు! పరివర్తన చెందగల మార్పు అభివృద్ధి చెందిన దేశంగా మనదేశ కలలను శక్తివంతం చేస్తుంది’’ అని ఆయన గర్వంగా చెప్పారు.

5జీ వేలంలో స్ప్రెక్టం బకాయిల కోసం భారతీ ఎయిర్‌టెల్‌ బుధవారం టెలికం శాఖకు రూ.8,312.4 కోట్లు చెల్లించింది. షెడ్యూల్‌ కంటే 4 సంవత్సరాల ముందుగానే బకాయిలు చెల్లించింది. ఈ నెలాఖరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖలను జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది, త్వరలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.ఈ స్పెక్ట్రమ్‌ కేటాయింపుతో, భారతదేశం #హ-స్పీడ్‌ 5జీ టెలికాం సేవలను విడుదల చేయడానికి చివరి దశలో ఉంది.

5జీ అంటే ఏమిటి? 3జీ,4జీ సేవలకు ఎలా భిన్నంగా ఉంటుంది?
5జీ అనేది ఐదవ తరం మొబైల్‌ నెట్‌వర్క్‌. ఇది చాలా వేగంగా డేటాను ప్రసారం చేయగలదు. 3జీ-4జీలతో పోల్చితే, చాలా తక్కువ జాప్యాన్ని కలిగి ఉంది. ఇది వివిధ రంగాలలో వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తుంది. తక్కువ జాప్యం అనేది కనిష్ట ఆలస్యంతో చాలా ఎక్కువ పరిమాణంలో డేటా సందేశాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యాన్ని వివరిస్తుంది. 5జీ రోల్‌అవుట్‌ మైనింగ్‌, వేర్‌#హౌసింగ్‌, టెలిమెడిసిన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ వంటి రంగాలలో రిమోట్‌ డేటా మానిటరింగ్‌లో మరింత అభివృద్ధిని తీసుకువస్తుందని కూడా భావిస్తున్నారు. స్పెక్ట్రమ్‌ వేలంలో రిలయన్స్‌ జియో, అదానీ గ్రూప్‌, భారతీ ఎయిర్‌టెల్‌ , వొడాఫోన్‌ ఐడియా నాలుగు ప్రధాన భాగస్వాములు.

వేలం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది?
టెలికాం శాఖ మొత్తం వేలం విలువను అందుకుంది. ఇటీవల ముగిసిన వేలం నుండి 1.50 లక్షల కోట్లు సేకరించింది. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.80-90 వేల కోట్లని ప్రాథమికంగా అంచనా వేశారు. 5జీసేవలు 4 జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంగా ఉంటాయని అంచనా.టెలికాం ఆపరేటర్‌లకు స్పెక్ట్రమ్‌ల కేటాయింపు ఆగస్టు 15 కంటే ముందే ఊ#హంచబడింది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి దేశంలో ప్రారంభ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 2022 నాటికి దేశంలోని అనేక నగరాల్లో హైస్పీడ్‌ 5జీ సేవలు అందించబడొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నారు. ఇటీవల టెలికాం రంగంలోకి ప్రవేశించిన గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ 5జీ టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం వేలం ప్రక్రియలో మొదటిసారి పాల్గొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement