కాకినాడలో భయాందోళనలు సృష్టిస్తున్న పెద్దపులిని పట్టుకోవడానికి ఫారెస్టు డిపార్ట్‌మెంట్ ట్రై చేస్తోంది. బెంగాల్ టైగర్ కోసం కాకినాడ జిల్లాలో టైగర్ హంట్ కొనసాగుతోంది. ఎనిమిదిచోట్ల బోన్లు పెట్టారు అధికారులు. అయితే కొద్ది రోజులుగా ఇది చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది. కాగా, నిన్న కూడా పులి బోను దాకా వచ్చి అంతా తిరిగి చూసి అక్కడి నుంచి మళ్లీ తప్పించుకుంది. సీసీ టీవీ కెమెరాకు ఐ కాంటాక్ట్ ఇచ్చి మరీ అక్కడి నుంచి తప్పించుకోవడంతో అధికారులు కూడా అవాక్కవుతున్నారు.
ఈ విషయాలన్ని సీసీ టీవీ ఫుటేజీలో కనిపించాయి. ఒక బోనులో ఎరగా పశువును, ఆ పక్కనే మరో బోనులో లేగ దూడను ఉంచారు. వీటిని తినడానికి వచ్చిన ఆ పులి బోను వద్ద తచ్చాడుతూ కనిపించింది కానీ, ఎటువంటి హాని చేయలేదు. ఇక అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. 16 రోజులుగా ఇట్లాగే జరుగుతోంది. ప్రత్తిపాడు దగ్గరున్న ఈ ఏరియాలో ఈ పులి సంచారం జనాలను ఆందోళనకు గురిచేస్తోంది.