కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న దేశంలో మూడోవేవ్ కూడా తప్పదని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థర్డ్ వేవ్ 18 ఏళ్ల లోపు వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైరాలజిస్ట్ డాక్టర్ వి రవి హెచ్చరించారు. దేశంలో చిన్న పిల్లల కోవిడ్ కేర్ సెంటర్లు లేవని, అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కూడా లేవని… ఇది చాలా ఆందోళనకరమని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ వి రవి అన్నారు. వెంటనే ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. థర్డ్ వేవ్ ప్రభావం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దలతో పోలిస్తే ఐదేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో కరోనా వైరస్ ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఉన్నవ్యక్తి నుంచి వచ్చే వైరస్ పిల్లలను నుంచి బలంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. పెద్దలతో పోలిస్తే పిల్లల గొంతు, ముక్కులో పది నుంచి వంద రెట్లు ఎక్కువ వైరస్ నిల్వ చేసుకుంటారని పేర్కొన్నారు. కరోనా స్వల్పంగా ఉన్న పిల్లలపై చేసిన పరిశోధన ఆధారంగా ఈ అవగాహనకు వచ్చారు. దీనివల్ల పిల్లలకు తొందరగా వైరస్ సోకుతుంది, అలాగే వీరి నుంచి ఇతరులకు కూడా చాలా ఫాస్ట్‌గా ఇతరులకు సోకుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. భారత్ వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ల కార్యక్రమం నత్తనడకన సాగడం చాలా ప్రమాదకరమని పేర్కొంది. దేశంలో చిన్న పిల్లల కోవిడ్ కేర్ సెంటర్లు లేవని, అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కూడా లేవని… ఇది చాలా ఆందోళనకరమని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ వి రవి అన్నారు. వెంటనే ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.