కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో వృద్ధులు, యువజనులపై అధిక ప్రభావం చూపిన మహమ్మారి..థర్డ్ వేవ్ లో చిన్నారులపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో థర్డ్ వేవ్ మొదలయి అక్టోబర్ వరకు పీక్స్ వెళ్తుందని ఇప్పటికే పలు వైద్య సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా థర్డ్ వేల్ లో చిన్నారులపై ప్రభావం ఉంటుందన్న నేపథ్యంలో వారి తల్లిదండ్రుల భాయాదోళనకు గురవుతున్నారు. ఏం చేయాలో తోచని పరిస్థితులో అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరటనిచ్చే విధంగా ఓ అధ్యయనంలో పలు విషయాలు వెలుగు చూశాయి. కొవిడ్-19 బారిన పడిన పిల్లల్లో కనిపించే లక్షణాలు ఎక్కువకాలం ఉండబోవని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. వైరస్ లక్షణాలు ఉన్న చిన్నారుల్లో ఎక్కువమంది ఆరురోజుల్లోనే కోలుకుంటున్నట్టు వెల్లడించింది.
బ్రిటన్ లోని వైద్య పత్రిక ‘లాన్సెట్ చైల్డ్ అండ్ అడాలెసెంట్ ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. చిన్నారుల్లో వైరస్ తీవ్రత, లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు 5-17 వయసున్న 2.5 లక్షల మంది పిల్లలపై 2020 సెప్టెంబర్ 1 – 2021 ఫిబ్రవరి 22 మధ్య ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ‘జో కొవిడ్’ యాప్‌ను ఈ అధ్యయనం కోసం వినియోగించారు.
ఆ అధ్యయనంలోని పలు విషయాలు :
- చిన్నారులపై కొవిడ్-19 తీవ్రత, దీర్ఘకాలంలో లక్షణాలు తక్కువే. లక్షణాలు ఉన్న చిన్నారులు ఆరురోజుల నుంచి 4 వారాల్లో కోలుకుంటున్నారు.
- వైరస్ సోకినా కొందరిలో లక్షణాలు లేవు. అయితే వీరు స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.
- వ్యాధికి గురైన తొలివారంలో పిల్లల్లో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి. అలసట, తలనొప్పి, వాసన కోల్పోవడం.
- అతి తక్కువ మంది చిన్నారుల్లో మాత్రమే నెలరోజుల తర్వాత కూడా లక్షణాలు కనిపించాయి. 84 శాతం మంది చిన్నారుల్లో అలసట కనిపించింది.
- 5-11 వయసుల వారి కంటే 12-17 వయసున్న చిన్నారులు ఎక్కువగా దీర్ఘకాల అనారోగ్యానికి గురవుతున్నారు.
- జలుబు, ఫ్లూ వ్యాధులు ఉన్న చిన్నారులు వైరస్‌బారిన పడినప్పుడు వారిలో కనిపించే లక్షణాలు మిగతా చిన్నారుల కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: జగిత్యాల జిల్లాలో మరోసారి లాక్డౌన్..