శ్రీలంతో జరుగుతున్న మూడో టీ 20లో టీమిండియా బ్యాట్స్‌మన్, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20ల్లో మూడో శతకం నమోదు చేశాడు. టీమిండియా తరఫున వేగవంతమైన టీ20 సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కాగా, ఐదు వికెట్లు నష్టపోయిన టీమిండియా మొత్తం స్కోరు 228 పరుగులు చేసింది.
ఈ విషయంలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. 2017 శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లోనే శతకం బాదాడు. తన స్టయిల్ షాట్లతో లంక బౌలర్లపై విరుచుకుపడిన సూర్య స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శుభ్‌మన్ గిల్ 48 , రాహుల్ త్రిపాఠి 35 రాణించారు. దీపక్ హుడా (4), ఇషాన్ కిషన్ (1) విఫలం అయ్యారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టీ 20లో ఇండియా 2 పరుగులతో గెలిచింది. రెండో టీ20లోశ్రీలకం 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.