ఉత్తరప్రదేశ్‌లో మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మూడో విడుతలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2 కోట్ల 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతున్నది. ఆయనకు పోటీగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ బరిలోకి ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement