Saturday, November 23, 2024

Omicron: కర్ణాకటలో మూడో ఒమిక్రాన్ కేసు.. దేశంలో 36కి చేరిన బాధితులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చేప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఆదివారం ఒక్క రోజే కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తోపాటు ఛండీగడ్ లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. తాజాగా కర్ణాటకలో మూడో కేసు వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి పరీక్షించగా ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. ఈయనతో సంబంధం ఉన్న 5 ప్రైమరీ కాంటాక్ట్ లను, 15 సెకండరీ కాంటాక్ట్ లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. తాజాగా నమోదైన కసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 36కి చేరింది.

కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసు కర్ణాటకలోనే నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా మూడో కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఓవైపు కరోనా కేసులు తగ్గుతుంటే.. ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీసహా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా రాష్ట్రాల్లో వ్యాప్తిస్తోంది. మహారాష్ట్రలో 17 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 3, రాజస్థాన్ 9, ఢిల్లీ 2, ఛండీగడ్ 1, గుజరాత్ 3, ఏపీ 1 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు అప్రమత్తమైయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచాయి. ఎయిర్ పోర్ట్ లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement