సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, పొలిటీషియన్స్‌ని టార్గెట్ చేసుకోవడానికి స్పైవేర్‌ను ఉపయోగించినట్టు ఆధారాలున్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. 2017లో అయితే 2బిలియన్ల యూఎస్ డాలర్లకు ఆ స్పైవేర్ కొనడానికి ప్రతిపాదనలు చేసుకున్నారు. ఈసారి 2024లొ జరిగే ఎన్నికలకు అయితే 4 బిలియన్ల యూఎస్ డాలర్లకు స్పైవేర్ కొంటారమే అని బీజేపీ సర్కారుపై, ప్రధాని మోడీపై వ్యంగాస్త్రాలు సంధించారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు, మాజీ న్యాయమూర్తి, అటార్నీ జనరల్, 40 మంది జర్నలిస్టులపై నిఘా పెట్టారని.. ఇది వాస్తవం కాదా అని చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు.
న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదికను పేర్కొంటూ పెగాసస్ స్పైవేర్‌పై తాజా వివాదంపై చిదంబరం ఈరోజు ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారు. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ఆరోపించిన ఖర్చు కంటే రెట్టింపు ధరతో తాజా స్పైవేర్‌ను తీసుకుంటుందని ఎగతాళి చేశారు. అంతేకాకుండా ఈ నివేదిక బయటపెట్టిన న్యూయార్క్ టైమ్స్‌ని సుపారీ మీడియా అని పిలిచిన కేంద్ర మంత్రి VK సింగ్ కూడా చిదంబరం విడిచిపెట్టలేదు.
“వాటర్‌గేట్ కుంభకోణం, పెంటగాన్ వంటి వాటిని బహిర్గతం చేయడంలో రెండు వార్తాపత్రికలు పోషించిన పాత్ర అతనికి తెలిసి ఉండకపోవచ్చు.. చరిత్ర చదవడానికి అతను ఇష్టపడకపోతే కనీసం సినిమాలను అయినా చూడాలి కదా!” అని చిదంబరం ట్వీట్ చేశారు.