Friday, November 22, 2024

వాళ్ల పని బాగుందయ్య.. అక్కడ నాలుగున్నర రోజులే పని..

ప్ర‌భ‌న్యూస్ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుతం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు వారంలో మొత్తం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు యూఏఈలో శుక్ర, శనివారం సెలవు రోజులుగా ఉండగా.. తాజా నిర్ణయంతో.. జనవరి 1, 2022 నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రారంభం అవుతాయి. 2006కి ముందు యూఏఈలో గురువారం, శుక్రవారం సెలవు రోజులుగా ఉండేవి. ఆ తరువాత ప్రైవేటు కంపెనీల రాకతో శుక్ర, శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించారు. ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్లతో అనుసంధానం అయ్యేందుకు వీలుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచే వారాంతపు సెలవులను ప్రవేశపెట్టారు.

శని, ఆదివారాలను సెలవుగా పాటించే దేశాలతో ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ తెలిపింది. ఈ నిర్ణయంతో దేశంలో పని చేసే వేలకొద్దీ అంతర్జాతీయ కంపెనీల లావాదేవీలు మరింత సరళంగా జరుతాయని తెలిపింది. దేశ ఆర్థిక పోటీతతాన్ని పెంపొందించడానికి పనితీరును పెంచుతూనే.. పని-జీవితం మధ్య సమతుల్యతను పెంచడానికి, సామాజిక శ్రేయస్సు మెరుగుపర్చడానికి యూఈఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ అధికారిక మీడియా తెలిపింది. జాతీయ పని వారాన్ని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐదు రోజుల వారం కంటే.. తక్కువగా ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే తొలి దేశంగా యూఏఈ నిలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement