Friday, November 22, 2024

అవి రబ్బరు బుల్లెట్లే.. అయినా నాకు అర్హత ఉంది, తప్పుడు ప్రచారం చేయొద్దు: మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ర్యాలీలు తీస్తూ, దేశభక్తిని చాటుతున్నారు చాలామంది. కొన్నిచోట్ల లీడర్లు, మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అయితే.. కొన్ని ఘటనలు కాస్త కాంట్రవర్సీ అవుతున్నాయి. మొన్న ఏపీలో మంత్రి జెండా కింద నుంచి వాహనం వెళ్లిన ఘటన జరిగింది. కాగా, తాను వాహనంలో లేనని, నడుచుకుంటూ వెళ్లినట్టు మంత్రి ఆ తర్వాత వివరణ ఇచ్చారు. కాగా, ఇవ్వాల (శనివారం) తెలంగాణలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడం పెద్ద దుమారమే చెలరేగింది. మహబూబ్ నగర్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నెటిజన్లు దీన్ని తప్పుపడుతున్నారు. అయితే.. తెలంగాణ క్రీడా, సాంస్కృతిక మంత్రిగా తనకు ఆ అధికారం ఉంటుందని, అయినా తాను కాల్చింది రబ్బర్​ బుల్లెట్​ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు మంత్రి శ్రీనివాస్​గౌడ్​.

పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని త‌న చేతుల్లోకి తీసుకుని, జ‌నం చూస్తుండ‌గానే గాల్లోకి మంత్రి కాల్పులు జ‌రిపారు. అంతేకాకుండా తాను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్ గా ఉన్నానని, క్రీడా మంత్రిగా తనకు అర్హత ఉంటుందని చెబుతున్నారు. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతున్నారు. ఇంకా కావాలంటే జిల్లా ఎస్పీ నుంచి సమాచారం తీసుకోవచ్చని తెలిపారు మంత్రి శ్రీనివాస్​గౌడ్​. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారని, తాను నిజమైన బుల్లెట్ కాల్చినట్లయితే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement