శంకర్పల్లి (ప్రభన్యూస్): ‘‘తల్లిదండ్రులు చీటికిమాటికి నన్ను కొడుతున్నారు. వారిపై కేసు బుక్ చేయండి సార్’’.. అంటూ ఓ 11 ఏండ్ల పిల్లోడు శంకర్పల్లి పోలీసులను ఇవ్వాల (మంగళవారం) ఆశ్రయించాడు. దీనిపై చర్యలు తీసుకునే ముందు ఎస్సై సంతోష్ ఆ తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ లో ఉండే నర్సింలు, లక్ష్మీ కుమారుడు రాములు అయిదో తరగతి చదువుతున్నాడు. అతడిని చీటికిమాటికి తల్లిదండ్రులు కొడుతూ ఉండడంతో పేరెంట్స్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదు తీసుకొని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్టు ఎస్సై సంతోష్ వెల్లడించారు. మరోసారి ఇలాంటి సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలని, అబ్బాయిని బాగా చూసుకోవాలని సూచించారు.