Friday, November 22, 2024

తెలంగాణ ఎంసెట్ లో టాపర్స్ వీరే…

ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు.ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది పరీక్ష రాయగా… అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 1,06,514 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,56,879 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 82 శాతం మంది అమ్మాయిలు, 79 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 87 శాతం మంది అమ్మాయిలు, 84 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు.

ఇంజినీరింగ్ టాప్ ర్యాంకర్లు:
మొద‌టి ర్యాంక్ – శనపాల అనిరుధ్
రెండో ర్యాంక్ – యాకంటిపల్లి మునీందర్ రెడ్డి
మూడో ర్యాంక్ – చల్లా ఉమేశ్ వరుణ్
నాలుగో ర్యాంక్ – అభినిత్ మంజేటి
ఐద‌వ‌ ర్యాంక్ – ప్రమోద్ కుమార్.

అగ్రికల్చర్, మెడిసిన్ టాప్ ర్యాంకర్లు:
మొద‌టి ర్యాంక్ – బూరుగుపల్లి సత్య
రెండో ర్యాంక్ – ఎన్. వెంకటతేజ
మూడో ర్యాంక్ – సఫల్ లక్ష్మి
నాలుగో ర్యాంక్ – కార్తికేయ రెడ్డి
ఐదో ర్యాంక్ – బి. వరుణ్ చక్రవర్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement