Saturday, November 23, 2024

యూపీలో బిజెపి స‌త్తా – సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే

రెండోసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బిజెపి త‌న సత్తాని చాటింది. యూపీలో 1952 మే 20న మొద‌టిసారి శాస‌న‌స‌భ ఏర్పాట‌యింది. కాగా 70 ఏళ్లలో 21 మంది సీఎంలు కొలువు దీరారు. ఒక సీఎం మొదటి ఐదేళ్లు పాలన పూర్తి చేసుకుని, విజయవంతంగా రెండోసారి ఎన్నికైంది యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే. యూపీలో వరుసగా రెండుసార్లు సీఎం అవకాశం లభించింది ఐదుగురికే. వారిలో యోగి ఆదిత్యనాథ్ ఐదో వ్యక్తి. గతంలో 1957లో సంపూర్ణానంద, 1962లో చంద్రభాను, 1974లో హేమవతీ నందన్ బహుగుణ, 1985లో ఎన్డీ తివారీకే ఇలా అవకాశం లభించింది. 37 ఏళ్లలో అధికారం నిలబెట్టుకున్న సీఎం ఆదిత్యనాథే. 1985లో అవిభాజ్య యూపీ సీఎంగా ఎన్డీ తివారీ ఉన్నారు. నాడు ఎన్నికల్లో తివారీ మళ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఇంత వరకు మరెవరికీ అది సాధ్యపడలేదు.యూపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్య‌మంత్రి ఆదిత్యనాథే. యూపీకి నలుగురు బీజేపీ నేతలు ముఖ్యమంత్రులుగా గతంలో వ్యవహరించారు. కల్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్ నాథ్ సింగ్ లో ఎవరూ తిరిగి అధికారం నిలబెట్టుకోలేకపోయారు.

ఎమ్మెల్సీ గా యోగి ఆదిత్యనాథ్ యూపీని పాలించారు. 2017లో యూపీకి సీఎం అయిన సందర్భంలో ఆయన లోక్ సభ ఎంపీగా ఉన్నారు. దాంతో సీఎంగా అధికారం చేపట్టి నిబంధనల కింద ఆరు నెలల్లోపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సీటును ఖాళీ చేయించి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపలేదు. ఇలా ఎమ్మెల్సీ ముఖ్య‌మంత్రి అయిన నాలుగో వ్యక్తిగా రికార్డు నమోదు చేశారు. గతంలో మాయావతి కూడా ఇలానే ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అయ్యారు. యూపీలో ఐదేళ్లు పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రుల్లో యోగి మూడో వ్యక్తి. గతంలో మాయావతి 2007-2012, అఖిలేశ్ యాదవ్ 20012-2017 ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు.నోయిడాలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ పట్టణాన్ని ఎవరు సందర్శిస్తారో.. తదుపరి పర్యాయం వారు అధికారంలోకి రారన్న ఒక నమ్మకం ఉంది. కానీ, 2018 డిసెంబర్ 25న ఆదిత్యనాథ్ తోపాటు, ప్రధాని మోడీ అక్కడకు వెళ్లారు. ఇద్దరూ తిరిగి విజయం సాధించడం విశేషం. ఈ విజ‌యంతో బిజెపిలో నూత‌నోత్సాహం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement