Sunday, November 17, 2024

Smart Tech: వాట్సాప్‌లో కొత్త‌​ ఫీచర్స్​ ఇవే.. ఈ అయిదింటిపైనా ఓ లుక్కేయండి!

మెస్సేజింగ్ యాప్‌ల‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్ల‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది స‌బ్‌స్క్రైబ‌ర్లుండ‌గా.. ఒక్క ఇండియాలోనే వాట్సాప్​కు 50కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు వాట్సాప్​ ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది. అందుకు తగ్గట్టు కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తుంది. ఈ క్రమంలో.. కొత్త‌గా రానున్న అయిదు వాట్సాప్​ ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఇవి.. ​ వాట్సాప్​ వెబ్​, ఫోన్​ యాప్​కు కూడా అందుబాటులోకి రానున్నాయి.

చాట్​ విత్​ యువర్ ​సెల్ఫ్..
ప్రస్తుతం వాట్సాప్​ యూజర్లు తమకి తాము మెసేజ్​ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్​తో చాట్​కు ‘మెసేజ్​ యువర్​సెల్ఫ్​’ ఆఫ్షన్​ యాడ్​ అవుతుంది. వాట్సాప్​ కాంటాక్ట్స్​ లిస్ట్​లో చాట్​ విత్​ యువర్​ ఫోన్​ నెంబర్​ ఆప్షన్​ కూడా ఉండ‌బోతోంద‌ని వాబీటాఇన్​ఫో నివేదికలో పేర్కొన్నారు.

గ్రూప్​ చాట్స్​లో ప్రొఫైల్​ ఫొటోస్​..
వాట్సాప్ గ్రూప్​ చాట్స్​లోని వారికి ప్రొఫైల్​ ఫొటోలు పెట్టుకునే అవకాశాన్ని కల్పించేందుకు కొత్త ఫీచర్​ను తీసుకురానున్నారు. ఈ ఫీచర్​తో.. గ్రూప్​లో ఏదైనా మెసేజ్​ వస్తే.. ఆ మెసేజ్​ పంపిన వారి ప్రొఫైల్​ ఫొటో కనిపించ‌నుంది. ప్రైవసీ సెట్టింగ్స్​ లేదా ప్రొఫైల్​ ఫొటో కనిపించకపోతే.. గ్రూప్​ చాట్​లో డీఫాల్ట్​ ప్రొఫైల్​ క‌నిపించేలా సెట్ చేసుకోవ‌చ్చు.

మీడియాకు క్యాప్షన్​..
మెసేజ్​లు, వీడియోలు, జిఫ్​లు, డాక్యుమెంట్లతో పాటు వాటి కింది క్యాప్షన్లు కూడా జత చేసే ఫీచర్​ను వాట్సాప్​ డెవ‌ల‌ప్ చేస్తోంది. ఆండ్రాయిడ్​ వాట్సాప్​ బీటా 2.22.23.15 వర్షెన్​లో ఇది ఇప్ప‌టికే అందుబాటులో ఉంది. ఇతర డివైజ్​లకు కూడా త్వరలోనే ఈ ఫీచర్​ అందుబాటులోకి రానున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇమేజ్​లకు బ్లర్​ ఆప్షన్​..
వాట్సాప్​లో ఇమేజ్​లను బ్లర్​ చేసే ఆప్షన్​ ప్రస్తుతం కొన్ని డెస్క్​టాప్​ బీటా టెస్టర్లకే ఉంది. ఏదైనా ఇమేజ్​ పంపించిన‌ప్పుడు అందులోని సున్నితమైన అంశాలను బ్లర్​ చేసేందుకు ఈ ఆప్షన్​ పనికొస్తుంది. దీనికోసం రెండు బ్లర్​ టూల్స్​ను వాట్సాప్​ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్లర్​ సైజ్​ను కూడా యూజర్లు ఎంచుకోవచ్చు.

డెస్క్​టాప్​లో.. మీడియా ఆటో డౌన్​లోడ్​..
డెస్క్​టాప్​లో మీడియా ఫైల్స్‌ని అంటే పొటోలు కానీ, ఇత‌ర వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ వంటివి క్లిక్​ చేస్తే కానీ డౌన్​లోడ్​ కావు. కానీ, దీనికి ఆటో వర్షెన్​ను తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఫొటోలు, వీడియోలు, డాక్యమెంట్లు వంటివి ఆటో డౌన్​లోడ్​ చేసుకునేలా సెట్టింగ్స్​లో ఆప్ష‌న్స్ తీసుకురానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement