ఎల్గర్ పరిషద్-మావోయిస్టుల లింకు కేసులో ప్రజాకవి వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఇవ్వాల (శనివారం) ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆ బెయిల్‌కు సంబంధించిన కొన్ని కండిషన్స్‌ని వెల్లడించింది. వరవరరావు ముంబైలోనే ఉండాలని బెయిల్‌లో స్పష్టం చేసింది కోర్టు. ఎటువంటి అనుమతి లేకుండా సిటీ విడిచి వెళ్లొదని ఆ రూల్స్‌లో పేర్కొంది. ఇంకా.. ముంబైలో అతని నివాసం వద్ద భారీ సంఖ్యలో విజిటర్లు ఉండరాదని కూడా ఆ కండిషన్స్‌లో పేర్కొంది.
ఎటువంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పొడవద్దని, ఎల్గర్ కేసులో సహ నిందితులుగా ఉన్నవారితో కాంటాక్ట్‌లో ఉండరాదని కోర్టు బెయిల్‌లో షరతు పెట్టారు. ముంబైలో ఉండబోయే ఇంటి పూర్తి అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అతనితో ఉండే ముగ్గురు వ్యక్తుల ఫోన్ నెంబర్లను కూడా ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఎల్గర్ కేసుకు సంబంధించి మీడియాతో వరవరరావు మాట్లాడరాదు. వరవరరావు 50వేల బాండ్ సమర్పించాలని కోర్టు తెలిపింది.