Friday, November 22, 2024

గద్దెల కాడ గందరగోళం.. సమ్మక్క గద్దె తాళాలు పగలగొట్టేందుకు యత్నించిన భక్తులు

మేడారం, ప్రభన్యూస్ : మేడారం సమ్మక్క గద్దె వద్ద సోమవారం సుమారు అరగంట సేపు గందరగోళం ఏర్పడింది. కొంతమంది భక్తులు సమ్మక్క తల్లిని దర్శించుకోవడానికి గద్దె ( గ్రిల్స్ ) లోపలికి వెళ్లారు. ఈ సమయంలో సమ్మక్క గద్దె చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్ కు అక్కడ విధులు నిర్వహిస్తున్న వారు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గద్దెల లోపల గ్రిల్స్ లో ఉన్న భక్తులు సుమారు అరగంట పాటు లోపల ఉండిపోయారు. ఓ పక్క చంటి పిల్లవాడిని ఎత్తుకుని మరో ప్రక్క బంగారం ( బెల్లం ) నెత్తిన పెట్టుకొని వచ్చిన భక్తులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సహనం నశించిన భక్తులు గిల్స్ కు వేసిన తాళంను రాళ్లతో పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న వారు తాళం చెవి పట్టుకుని వచ్చి తాళం తీయడంతో గందరగోళం సద్దుమణిగింది. జాతర ప్రారంభానికి ముందే సమన్వయ లోపంతో ఇలా విధులు నిర్వహిస్తే జాతరలో విధులు ఎలా నిర్వహిస్తారు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement