Wednesday, November 27, 2024

ప్రీతి కేసులో నిందితులెవ‌రైనా వదలొద్దు.. మంత్రి కేటీఆర్

వరంగల్ క్రైమ్, మార్చి 9 (ప్రభ న్యూస్) : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మెడికల్ పిజి స్టూడెంట్ ప్రీతి కేసును తేల్చండంటూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ను ఆదేశించారు. ప్రీతి కేసులో నింధితులు ఎవ్వరైనా వదలొద్దని కూడా ఆదేశించారు. ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించినంతరం మంత్రి కేటీఆర్ అక్కడ నుండే పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కు కాల్ చేసి మాట్లాడారు. మంత్రి కేటీఆర్ జోక్యంతో పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రీతి కేసు మిస్టరీని ఛేజించడంతో పాటు, నింధితులను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.

అలాగే ఈ కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ అనస్థీయా హెచ్ ఓ డి ప్రో.నాగార్జున రెడ్డిపై ఉచ్చు బిగిస్తోంది. హెచ్ ఓ డి నిందితుడిని కట్టడి, కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకపోగా, తనకు కాకుండా ప్రిన్సిపల్ కు ఎందుకు ఫిర్యాదు చేశావ‌ని ప్రీతినే టార్గెట్ చేసి, కామెంట్స్ చేయడంపై సైఫ్ కు హెచ్ ఓ డి ప్రో.నాగార్జున రెడ్డి మద్దతుగా నిలిచినట్టుగా అనుమానిస్తున్నారు. మొత్తం వ్యవహారం నాగార్జున రెడ్డికి తెలిసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోను బదిలీ వేటు పడ్డ నాగార్జున రెడ్డిని కూడా విచారించాలని వరంగల్ పోలీస్ బాస్ ఏవి రంగనాథ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ లో ప్రీతి కేసు విషయంలో మంత్రి కేటీఆర్ కాల్ చేయడంతో స్వయంగా సిపి రంగనాథ్ రంగంలోకి దిగారు. ప్రీతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ మొదలుపెట్టారు. గతంలో సంచలనం రేపిన ఆయేషా కేసు మిస్టరీని ఛేజించిన పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగడంతో త్వరలో ప్రీతి చిక్కుముడి వీడటం ఖాయమని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement