సౌతిండియాన్ స్టార్ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. అందాల ప్రదర్శన కంటే అభినయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సరసన నటించే చాన్సెస్ అందుకుంది. నిత్యా తాజాగా ఓ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు బాగా పొగరు అని ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేసింది. తాను ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించింది.
ఇండస్ట్రీలో తనకు చాలామంది శత్రువులున్నారని వెల్లడించింది. వారే తనను కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటారని పేర్కొంది. వారికి లోబడి తాను నడుచుకోకపోవడంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని మండిపడింది. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించానని, ఏ ఒక్కరూ నిత్యాతో పనిచేయడం కష్టమని అనలేదని తెలిపింది.
- Advertisement -