పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి గడువు అనేదే లేదని స్పష్టం చేశారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు..
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమన్నారు.. ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తి అవుతుందని చెప్పిన మంత్రి… తొలి దశను పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు బుధవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హయాంలో జరిగిన చారిత్రక తప్పిదం వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నదని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణంగా ఉన్న డయాఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బ తిన్నదో దానిపై చర్చ జరగాలని అంబటి పేర్కొన్నారు. దీనిపై చర్చకు రావాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు ఆయన సవాల్ చేశారు. ఇంజినీర్లు, మేథావులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ చర్చ జరగాలన్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే నష్టం జరిగిందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి గడువే లేదు – మంత్రి అంబటి రాంబాబు
Advertisement
తాజా వార్తలు
Advertisement